ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు: సీఐ గంగాధర్

0చూసినవారు
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు: సీఐ గంగాధర్
ఆత్మకూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా సీఐ గంగాధర్, ఎస్సై జంపాని కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ డిపో నుంచి సత్రం సెంటర్ వరకు చేపట్టిన ఈ డ్రైవ్‌లో వాహనాల పత్రాలు, ట్రాఫిక్ నిబంధనల అమలును పరిశీలించారు. రహదారులపై వాహనాలను ఇష్టారాజ్యంగా నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన పలువురు వాహనదారులకు చలానాలు విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్