పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు, కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం అభిషేకాలు, చందనాలంకారం, శాంతి హోమం అనంతరం కళ్యాణోత్సవం జరిగింది. సాయంత్రం బంగారు గరుడ వాహన సేవలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.