అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

0చూసినవారు
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ఇంటి నుంచి అదృశ్యమైన ధనలక్ష్మి (45) అనే మహిళ, మంగళవారం సంగం సమీపంలోని కనిగిరి జలాశయం ప్రధాన కాలువలో మృతదేహంగా కనిపించింది. ఏడాదిగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఆదివారం అదృశ్యమయ్యారు. సోమవారం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను సంగంలో ఉన్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి వెతికినా ఆచూకీ లభించలేదు. చెప్పులు లభించడంతో సీసీ పుటేజీల పరిశీలనలో ఆమెను గుర్తించారు. కాలువలో మృతదేహం తేలియడుతూ కనిపించడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్