యువ కార్మికుడి దుర్మరణం: పైప్‌లైన్ పనుల్లో ప్రమాదం

5చూసినవారు
యువ కార్మికుడి దుర్మరణం: పైప్‌లైన్ పనుల్లో ప్రమాదం
వెంకటాచలం మండలం గోలగమూడి గ్రామానికి చెందిన ఎన్. సుధీర్ (20) బుచ్చి తాగునీటి పైప్‌లైన్ పనుల్లో భాగంగా గాంధీజన సంఘం సమీపంలో పనిచేస్తుండగా, హైడ్రా క్రేన్‌కు కట్టిన తాడు కాళ్లకు చిక్కడంతో కిందపడిపోయాడు. క్రేన్ డ్రైవర్ ముందుకు నడపడంతో సుధీర్ తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్