సూళ్లూరుపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ బుధవారం ఉదయం ప్రారంభమైంది. పట్టణంలోని బొగ్గుల కాలనీలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ స్వయంగా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.