
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పొదలకూరు మండలం ఇనుకుర్తి పెట్రోలు బంకు వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు, మోటార్ బైక్ ఢీకొన్న ప్రమాదంలో తాళ్లూరు రవీంద్ర (41) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సొంత పనుల నిమిత్తం పొదలకూరుకు వస్తుండగా ఎదురుగా రాపూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.





































