గుడ్లూరు తహశీల్దార్ కార్యాలయంపై శనివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడి చేశారు. గుడ్లూరు–2 సచివాలయానికి చెందిన గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) చలమారెడ్డి రూ. 20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. మాధవరెడ్డి అనే రైతు ఫిర్యాదు మేరకు ఈ దాడి జరిగింది. ప్రస్తుతం అధికారుల విచారణ కొనసాగుతోంది.