వేసవిలో అప్రమత్తంగా ఉండండి: కందుకూరు DSP సూచనలు

848చూసినవారు
వేసవిలో అప్రమత్తంగా ఉండండి: కందుకూరు DSP సూచనలు
కందుకూరు సబ్‌డివిజన్ ప్రజలు వేసవికాలంలో అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సూచించారు. ఈ సందర్భంగా భద్రతా సూచనలతో కూడిన కరపత్రాలను ఆవిష్కరించారు. వేసవిలో ఇళ్ల చోరీలు, స్నాచింగ్లు, బైక్ దొంగతనాలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఊరికి వెళ్లే సమయంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లడంతో పాటు నగదు, బంగారం బ్యాంకుల్లో భద్రపరచాలని తెలిపారు. అలాగే పిల్లలు చెరువులు, గుంటల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్