కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 48 మంది లబ్ధిదారులకు రూ. 25.64 లక్షల ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. గుడ్లూరు, లింగసముద్రం, ఉలవపాడు, వలేటివారిపాలెం మండలాల వారికి ఈ సహాయం అందింది. ఇప్పటివరకు 35 విడతల్లో 1,313 మందికి రూ. 10.42 కోట్ల సహాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల సంక్షేమానికి సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.