కందుకూరులో ఇంధన కొరత.. వాహనదారులకు ఇబ్బందులు

1771చూసినవారు
కందుకూరులో పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం పలు బంకుల్లో డీజిల్ అయిపోవడంతో మూసివేశారు. ఇంధనం ఉన్న బంకుల వద్ద వాహనాల భారీ క్యూలు, కిలోమీటర్ల మేర బారులు తీరడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పట్టణ ఎస్ఐ శివ నాగరాజు పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్