గుడ్లూరు: మహిళపై దాడి కేసులో నిందితుడికి రూ. 1000 జరిమానా

2చూసినవారు
గుడ్లూరు: మహిళపై దాడి కేసులో నిందితుడికి రూ. 1000 జరిమానా
గుడ్లూరు మండలం పురేటిపల్లిలో మహిళపై దాడి చేసిన కేసులో నిందితుడు జి. వెంకటేశ్వర్లుకు కందుకూరు కోర్టు రూ. 1,000 జరిమానా విధించింది. 2023లో ఆర్. సుశీలపై వెంకటేశ్వర్లు దాడి చేయగా పోలీసులు కేసు నమోదు చేసి, ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నిఖిల్ రెడ్డి ఈ తీర్పు వెలువరించినట్లు ఎస్ఐ వెంకట్రావు తెలిపారు.

ట్యాగ్స్ :