గుడ్లూరు: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

2చూసినవారు
గుడ్లూరు: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
గుడ్లూరు మండలంలోని మొండివారిపాలెం, ఆవులవారిపాలెం గ్రామాల్లో బుధవారం మత్స్యకారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే నాగేశ్వరరావు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ఆయన పింఛన్ నగదును అందించారు. వృద్ధులను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్ల మొత్తాలను పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్