గుడ్లూరు: ఆ భూములు వెంటనే స్వాధీనం చేసుకోవాలి

78చూసినవారు
గుడ్లూరు: ఆ భూములు వెంటనే స్వాధీనం చేసుకోవాలి
గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో ఆక్రమించిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్న వెంకటసుబ్బయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గుడ్లూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నాలుగేళ్ల క్రితం భూములు స్వాధీనం చేసుకోవాలని అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎందుకు అమలు చేయడం లేదు నిలదీశారు. ఆ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్