శనివారం, ఉలవపాడు గ్రామానికి చెందిన 35 ముస్లిం కుటుంబాలు కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీకి మద్దతుగా ఉన్న ఈ కుటుంబాలు, కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టిడిపిలో చేరినట్లు తెలిపారు. ఉలవపాడు పంచాయతీ 7వ వార్డు సభ్యుడు రఫీ కూడా ఈ సందర్భంగా టిడిపిలో చేరారు.