ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి 30వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలులోని పివిఆర్ గ్రౌండ్స్ లో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు డోలా, గొట్టిపాటి, సహచర ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి పాల్గొని, మాగుంట సుబ్బరామిరెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, తాను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లోనే మాగుంట సుబ్బరామిరెడ్డి కందుకూరు ప్రాంతంలో చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను దగ్గరగా చూశానని తెలిపారు.