శనివారం వలేటివారిపాలెం మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం మనదేనని ఆయన అన్నారు. నిస్సహాయులకు అండగా ఉంటూ భరోసా కల్పించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. కూటమి అంటే అభివృద్ధి అని ఆయన పేర్కొన్నారు.