కందుకూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దివి తిరుపతి నాయుడు అనారోగ్యంతో విజయవాడలోని NRI ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆస్పత్రికి వెళ్లి తిరుపతి నాయుడును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.