కందుకూరు అన్న క్యాంటీన్ చైర్మన్ గా 25వ వార్డ్ టీడీపీ నాయకులు ఉన్నం కొండలరావును ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో, ఉన్నం కొండలరావు గురువారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అన్న క్యాంటీన్ లో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రతపై ఎమ్మెల్యే సూచనలు చేశారు.