శనివారం లింగసముద్రం మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ లోని రామాలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న ఓ మహిళ జారిపడటంతో, బస్సు వెనుక టైరు ఆమె కాలుపై ఎక్కింది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను 108 అంబులెన్స్ లో కందుకూరు తరలించి, మెరుగైన వైద్యం అందిస్తున్నారు.