మాలకొండలో మే 2న జరిగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాల కోసం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఏర్పాట్లను సమీక్షించారు. దర్శనం, క్యూలైన్లు, తాగునీరు, భోజనం, లడ్డూ ప్రసాదం, పార్కింగ్, పోలీసు బందోబస్తు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. సుమారు 25-30 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తూ, వారికి మజ్జిగ, నీరు, చలివేంద్రాలు, టెంట్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. 30 వేల లడ్డూలు సిద్ధం చేయగా, 100 మంది పోలీసులతో భద్రత కల్పించనున్నారు.