ఇంధన కొరతపై ఆందోళన అవసరం లేదు: సబ్ కలెక్టర్ హిమవంశీ

0చూసినవారు
ఇంధన కొరతపై ఆందోళన అవసరం లేదు: సబ్ కలెక్టర్ హిమవంశీ
ఉలవపాడు మండలం మన్నేటికోటలోని భారత్ పెట్రోల్ బంకును సోమవారం సాయంత్రం కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంకులో ఇంధన నిల్వలు, సరఫరా విధానం, విక్రయాల నమోదు పత్రాలను ఆమె సమగ్రంగా పరిశీలించారు. ఇంధన కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా పెట్రోల్, డీజిల్ సరఫరా కొనసాగించాలని నిర్వాహకులకు ఆమె కఠినంగా ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్