ఆదివారం రాత్రి వలేటివారిపాలెం మండలం కాకర్లపాలెం బస్టాండ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. మార్కాపురానికి చెందిన నర్రా రవీంద్ర వాహనం దిగి రహదారి పక్కకు వెళ్తుండగా, బైకుపై వస్తున్న పామూరుకు చెందిన నాగేశ్వరరావు అతడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరూ గాయపడగా, 108 అంబులెన్స్ సిబ్బంది వారిని కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. రవీంద్రకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించినట్లు సమాచారం.