గుడ్లూరు గ్రామంలో పారిశుధ్య సేవలు అందిస్తున్న 13 మంది కార్మికులు గత నాలుగు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీధులు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు శుభ్రం చేస్తున్నా జీతాలు నిలిచిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల విడుదలలో జాప్యం వల్లే వేతనాలు ఆలస్యమవుతున్నాయని అధికారులు తెలిపారు. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.