కందుకూరు పట్టణంలో శనివారం రాత్రి బూడిద పాలెం మార్గంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న యువకుడిని స్థానికులు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు టౌన్ ఎస్ఐ శివ నాగరాజు ఆదివారం తెలిపారు. మృతుడి ఛాతిపై నరసింహ, యముడు అని పచ్చబొట్టు ఉన్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.