
కూటమి పాలనపై విశ్వాసంతో టీడీపీలోకి 20 కుటుంబాలు
కావలి పట్టణంలోని 15వ వార్డుకు చెందిన 20 కుటుంబాలు శనివారం ఎమ్మెల్యే దగుమాటి కావ్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని తెలిపారు. కావలి అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



































