ఉద్యోగ విరమణ పొందిన డిప్యూటీ డీఈఓ హరిప్రసాద్‌కు ఘన సన్మానం

కావలి పట్టణంలోని పి.బి.ఆర్. విట్స్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం ఉద్యోగ విరమణ పొందిన కావలి డిప్యూటీ డీఈఓ యం. హరిప్రసాద్ కు సన్మాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలిక వసతుల కల్పన జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం, జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు, ఏపీసీ వెంకటసుబ్బయ్యలు మాట్లాడుతూ హరిప్రసాద్ విద్యాభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం, ఉపాధ్యాయుల మార్గదర్శనంలో విశేష సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు డిప్యూటీ డీఈఓ నాయక్, ఆత్మకూరు డిప్యూటీ డీఈఓ జానకిరామ్, కందుకూరు డిప్యూటీ డీఈఓ నరసింహారావు, కావలి మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.