అల్లూరు మండలం బీరంగుంటలో
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్‌లు అందజేశారు. గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులందరికీ లబ్ధి చేకూరుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.