బోగోలు: జోరు వానలో పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

5చూసినవారు
బోగోలు మండలం మంగమూరు గ్రామంలో ఈరోజు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నూతన పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. జోరు వానను సైతం లెక్కచేయకుండా వర్షంలోనే నడుస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ప్రజలు ఎక్కడున్నా వారి వద్దకే వెళ్లి పెన్షన్ నగదు అందజేసేలా సీఎం చంద్రబాబు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.

ట్యాగ్స్ :