అల్లూరు మండలంలో ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
టీడీపీ కార్యాలయం వద్ద జెండా ఊపి రథాన్ని ప్రారంభించిన ఆయన, గ్రామాల్లో తడి–పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. చెత్తకు బదులుగా నిత్యావసర సరుకులు అందించే ఈ వినూత్న కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ రహిత గ్రామాల లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన తెలిపారు.