కావలి నియోజకవర్గంలో 758 మందికి సీఎం రిలీఫ్ ఫండ్

1694చూసినవారు
కావలి నియోజకవర్గంలో వివిధ వ్యాధులతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 758 మందికి ఇప్పటివరకు రూ. 6,58,26,582 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు అందజేసినట్లు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయంలో 41 మంది లబ్ధిదారులకు రూ. 27,28,936 విలువైన చెక్కులను ఆయన అందజేశారు. రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో కావలి నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందని, వైద్యానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.