నెల్లూరు జిల్లాలో నారా లోకేశ్ పర్యటన గురువారం ఖరారైంది. ఆయన దగదర్తికి రానున్నారు. దివంగత ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు, దివంగత యువ నేత మాలేపాటి భాను చందర్ కుటుంబ సభ్యులను లోకేశ్ పరామర్శించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కావలి డీఎస్పీ శ్రీధర్ బుధవారం పరిశీలించారు. లోకేశ్ తో పాటు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు.