డాక్టర్ సుబ్బారెడ్డి సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కావ్య

2చూసినవారు
డాక్టర్ సుబ్బారెడ్డి సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కావ్య
కావలి ఏరియా ఆసుపత్రిలో 27 ఏళ్లుగా సివిల్ సర్జన్ స్పెషలిస్ట్‌గా పనిచేసిన డాక్టర్ కే. సుబ్బారెడ్డి పదవీ విరమణ వేడుకలు శనివారం ఎస్‌ఆర్ పార్క్‌లో జరిగాయి. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, డాక్టర్ సుబ్బారెడ్డిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఆయన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. వైద్యులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని, ఆయన సేవలను ప్రశంసించారు.

ట్యాగ్స్ :