కావలి ఆర్టీసీ డిపో ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ఆర్. ఓ ప్లాంట్‌ను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి ప్రారంభించారు. ప్రయాణికులకు శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులోకి రావడం సంతోషకరమని వారు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు కొనసాగించాలని రోటరీ క్లబ్ సభ్యులను అభినందించారు.