కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్‌లో నిర్వహించనున్న మహానాడు కోసం భూమిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. టెంకాయ కొట్టి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మే 27–29 తేదీల్లో మహానాడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర తెలిపారు. పార్టీ శ్రేణుల సహకారంతో విజయవంతం చేస్తామని అన్నారు.