నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దిత్వా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరం, కావలి, కోవూరు, అల్లూరు, బుచ్చి, సంగం మండలాల్లోని అనేక ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. గత ఐదు ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లు కొట్టుకుపోయాయి. దీనితో విద్యార్థులు, ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.