వరికుంటపాడు మండలం గొల్లపల్లి ఎస్టీ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసె కాలిబూడిదైంది. ఈ ఘటనలో జయంపు నారాయణకు చెందిన నగదు, నిత్యావసర సరుకులు, విలువైన పత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. వీఆర్వో శ్రీనివాసులు నష్టాన్ని అంచనా వేశారు. చంద్ర ప్రభాకర్ రూ.5,000 తక్షణ సాయం గురువారం అందించారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. స్థానిక నాయకులు బాధితుడిని పరామర్శించారు.