నెల్లూరులో ఎడతెరిపిలేని భారీ వర్షం

3612చూసినవారు
ద్విత్వా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా నెల్లూరు పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు, చిరు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావలి, మైపాడు, ఇందుకూరుపేట తీర ప్రాంతాల్లో జోరు వర్షం నమోదవ్వగా, ఉదయగిరి, సీతారాంపురం మండలాల్లో మోస్తారు వర్షం కూడా లేకపోవడం గమనార్హం. ఈ తుఫాన్ కారణంగా జిల్లాలో జనజీవనం స్తంభించింది.