ఇన్‌స్టాగ్రాం ప్రేమ.. విశాఖ నుంచి కావలికి వచ్చిన ఇంటర్ యువతి

3చూసినవారు
ఇన్‌స్టాగ్రాం ప్రేమ.. విశాఖ నుంచి కావలికి వచ్చిన ఇంటర్ యువతి
విశాఖపట్నం సీతమ్మధారకు చెందిన ఓ యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడితో తిరుమలలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఇంటర్ పరీక్షలు రాసిన తర్వాత ఆమె ఉచిత బస్సులో విజయవాడకు వచ్చి, అక్కడి నుంచి కావలికి చేరుకుంది. అర్ధరాత్రి బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో పోలీసులు ఆమెను గుర్తించారు. విచారణ జరిపి యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్