కావలి రూరల్ మండలం రుద్రకోటలోని అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆయన అయ్యప్ప సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కావలి నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థించారు. స్వామి భక్తుడు మూలంరెడ్డి కామేశ్వర్ రెడ్డి విరాళంతో ఏర్పాటు చేసిన శ్రీ ఆంజనేయ స్వామి ధర్మధ్వజమును ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు.