కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ పి. జమాల్ వలి, 43 సంవత్సరాల నిర్దోషమైన సేవ తర్వాత శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై, ఎస్ఐ జమాల్ వలిని శాలువాతో సత్కరించి, చిరు బహుమతి అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 43 సంవత్సరాల పాటు పోలీస్ వృత్తిని దైవంగా భావించారని అన్నారు. ఈ వీడ్కోలు కార్యక్రమం కావలిలో జరిగింది.