టిడిపి సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ షేక్ మస్తాన్ సతీమణి మక్బుల్ జాన్ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలి పట్టణంలోని 10వ వార్డులో ఉన్న షేక్ మస్తాన్ నివాసానికి చేరుకుని మక్బుల్ జాన్ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.