కావలి: సుభానిని పరామర్శించిన ఎమ్మెల్యే

3చూసినవారు
కావలి: సుభానిని పరామర్శించిన ఎమ్మెల్యే
కావలి నియోజకవర్గ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు సయ్యద్ సుభాని భాష కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారని తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, శనివారం నెల్లూరులోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. సయ్యద్ సుభాని భాష ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్