కావలి మండలం పెద్ద పట్టపుపాలెం గ్రామానికి చెందిన తిరుపతమ్మ ఆటో ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటన అనంతరం ఆమెను నెల్లూరు అపోలో హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం హాస్పిటల్‌కు వెళ్లి తిరుపతమ్మను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకొని, అత్యుత్తమ వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.