కావలి: హోటల్‌పై పోలీసుల దాడి… ఏడుగురు స్టేషన్‌కు తరలింపు

1చూసినవారు
నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు, శనివారం రాత్రి కావలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్‌పై సీఐ గిరిబాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటల్ రిజిస్టర్‌లను పరిశీలించి, ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో, అనుమానాస్పద వ్యక్తుల కోసం విచారణ చేపట్టగా, మద్యం సేవిస్తున్న ఏడుగురిని గుర్తించి, వారిని స్టేషన్‌కు తరలించారు. తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్