నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

1039చూసినవారు
నెల్లూరు జిల్లా కావలి సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై టెంపో వాహనం బోల్తాపడిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు, ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. నరసరావుపేట వద్ద జొన్నగడ్డ గ్రామానికి చెందిన కొందరు తిరుమల దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో వస్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను కావలి ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్