అత్తపై కత్తి దాడి: అల్లుడికి 15 రోజుల రిమాండ్

1653చూసినవారు
అత్తపై కత్తి దాడి: అల్లుడికి 15 రోజుల రిమాండ్
కావలి రూరల్ బుడంగుంట కాలనీలో అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు చల్లా శ్రీనివాసులుపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. భార్యను కాపురానికి పంపించలేదనే కారణంతో అల్లుడు తన అత్త తురక రమణమ్మపై దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన రమణమ్మ చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి మంగళవారం కావలి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి నిందితుడికి 15 రోజుల రిమాండ్ విధించగా, అతడిని కావలి సబ్ జైలుకు తరలించారు.

సంబంధిత పోస్ట్