కావలి GRP పోలీస్ స్టేషన్ పరిధిలోని పడుగుపాడు–కొడవలూరు రైల్వే ట్రాక్ వద్ద సుమారు 40–45 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రైలు నుంచి పడిపోవడం వల్లే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడిపై బులుగు బనియన్, నీలం ప్యాంటు, నలుపు–ఎరుపు షార్ట్ ఉన్నాయని, వివరాలు తెలిసినవారు కావలి రైల్వే పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.