నెల్లూరు జిల్లా వింజమూరు మండలం తమిదపాడు గ్రామంలో సోమవారం రాత్రి పాముకాటుకు గురై మలకొండయ్య (గంగయ్య) అనే వ్యక్తి మృతి చెందారు. ఈ విషాద ఘటనపై స్పందించిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ సహాయంగా రూ.10,000 అందజేశారు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహాయం అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,
టీడీపీ నాయకులు పాల్గొన్నారు.