కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలకు ప్రతీక అయిన ఈద్ అల్ అదా పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవించాలని, ఉన్నదాంట్లో ఇతరులకు పంచిపెట్టే దాతృత్వ భావనను బక్రీద్ తెలియజేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలపై అల్లా ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.