సోమవారం కావలి మండలంలోని మద్దూరుపాడు, అడవి రాజుపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను అర్హులందరికీ పారదర్శకంగా అందిస్తోందని తెలిపారు. గ్రామస్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.